G2 Movie | థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో కేరాఫ్ అడ్రస్ నటుడు అడివి శేష్. అందరు మాస్, యాక్షన్, లవ్ జానర్లను పట్టుకంటే నాకంటూ కొత్తగా ఒకటి ఉండాలి అని ఏకంగా థ్రిల్లర్ జానర్ సెట్ చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే థ్రిల్లర్ అండ్ స్పై జానర్లో ఇతడు నటించిన క్షణం, ఎవరు, గూఢచారి, హిట్ 2 చిత్రాలు హిట్ అందుకోవడమే కాకుండా శేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక శేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘గూఢచారి’ (Gudachari2) ఒకటి. 2018లో స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాకు ‘జీ 2’(G2) అంటూ సీక్వెల్ రాబోతుంది.
ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘జీ 2’లో విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించనున్నట్లు చిత్రయూనిట్ ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘జీ 2’ నుంచి ఇమ్రాన్ హష్మీ, అడివి శేష్ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఇమ్రాన్ హష్మీ గన్ పట్టుకుని ఉండగా.. అడివి శేష్ సంకెళ్లతో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌కి స్నేహితులా? శత్రువులా? ప్రత్యర్థులా.? అంటూ రాసుకోచ్చారు.
Friends? Enemies? Rivals.@emraanhashmi 🔥
5th of the 6 #MomentsofG2#G2 #Goodachari2 pic.twitter.com/1frdp8vs8E
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2024
.#MomentsofG2#G2 in cinemas 2025.#6YearsOfGoodachari@AdiviSesh pic.twitter.com/zKzEql44pL
— BA Raju’s Team (@baraju_SuperHit) August 3, 2024
ఈ సీక్వెల్లో అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి బనితా సంధు నటించనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీవీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read..
Nara Bhuvaneshwari | శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
IMD | మహారాష్ట్రకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
Watch: తాజ్‌మహల్ వద్ద గంగా జలంతో అభిషేకానికి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?