Aditya Om | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆదిత్య ఓం (Aditya Om). లాహిరి లాహిరి లాహిరి సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ నటుడు గతేడాది నాతో నేను సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కూడా సందడి చేశాడు. ఆదిత్య ఓం ప్రస్తుతం బంధీ సినిమాలో నటిస్తున్నాడు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు ఆదిత్య ఓం.
ఆదిత్య ఓం తెలంగాణలోని గిరిజన గ్రామం చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని.. చెరుపల్లి, ఇరుగు పొరుగుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ ఊరి జనాలకు అందించే దిశగా ముందుకెళ్తున్నాడు. ఈ ప్లాంట్ ద్వారా వచ్చే సురక్షితమైన నీటితో అనారోగ్య సమస్యలు దూరం కానున్నాయి. ఈ నేపథ్యంలో చెరుపల్లి గ్రామస్తులు ఆదిత్య ఓంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Bhool Bhulaiyaa 3 | కార్తీక్ ఆర్యన్ భూల్ భూలైయా 3 వచ్చేస్తుంది.. ఓటీటీ ప్రీమియర్ డేట్ ఫిక్స్