Adipurush First Look Poster | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ అప్డేట్లు త్వరలోనే రానున్నాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉంది. అయితే షూటింగ్ గడిచి నెలలు దాటుతున్నా సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఒక్కటి కూడా రాకపోవడంతో ప్రభాష్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్‌కు దర్శకుడు ఓం రౌత్ బిగ్ అప్డేట్ను ప్రకటించాడు.
తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో ఓం రౌత్ ఆదిపురుష్‌కు సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ను ప్రకటించారు. ప్రభాస్ బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఫస్ట్‌లుక్ గాని, గ్లింప్స్ గాని బర్త్‌డే రోజున విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు నెటీజన్లు తెలుపుతున్నారు. ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Read Also:
Adipurush Movie | ఆ అగ్ర నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు.. !
Adipurush | తెలుగు రాష్ట్రాల్లో భారీగా ‘ఆదిపురుష్’ థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలలు బయటకు రాలేదట..!