Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలల వరకు రూమ్ నుండి బయటకు రాలేదట..!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి.. హీరోగా విభిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. అయితే శర్వా ప్రస్తుతం హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈయన నటించిన గత ఐదారు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు శర్వా ఆశలన్నీ ‘ఒకే ఒక జీవితం’ పైనే ఉన్నాయి. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇదిలా ఉంటే శర్వానంద్‌ను ఆ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచిందట. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మూడు నెలలు బయటకు రాలేదట. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే ‘పడి పడి లేచే మనసు’. 2018లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. విడుదలకు ముందు ఈ సినిమాపై శర్వానంద్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఈ చిత్రం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని భావించాడట. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో తీవ్రంగా నిరాశపడ్డాడట. అంతేకాకుండా మూడు నెలల వరకు ఇంట్లో నుండి బయటకు రాలేదట. అంతలా ఈ సినిమా ఫలితం తనను నిరాశపరిచిందని తెలిపాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడీ దర్శకత్వం వహించాడు.
సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని కీలక పాత్రలో నటించింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. మ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

