ఆది సాయికుమార్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ : ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. అగ్రహీరో ప్రభాస్ ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికీ, అసురుడికీ మధ్య జరిగిన ఓ భీకరయుద్ధం ఈ కథకి మూలం’ అంటూ సాయికుమార్ గంభీరంగా చెప్పిన వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలైంది.
విజ్ఞాన శాస్త్రం, సనాతనధర్మం.. ఈ రెంటిలో ఏది ప్రామాణికం? అనే ప్రశ్నకు సమాధానంగా ట్రైలర్ సాగింది. విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి. ఆది సాయికుమార్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అర్చన అయ్యర్, స్వశిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ఇతరపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, సంగీతం: శ్రీచరణ్ పాకాల.