Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ (Ajith kumar) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అజిత్ కుమార్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. కొన్ని రోజులుగా యూరోపియన్ కంట్రీ బల్గేరియాలో కొనసాగుతుండగా.. అజిత్‌కుమార్, యోగిబాబు స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
అజిత్‌కుమార్ చివరి రోజు షూట్లో సునీల్‌తో మాట్లాడుతున్న విజువల్స్‌తో తాజా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజిత్ అందరికీ షాక్ ఇస్తూ.. స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అజిత్ సార్ నాకు ఈ జీవితకాల అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నా కల నెరవేరింది. చివరి రోజు షూటింగ్.. ఎంత అందమైన ప్రయాణం..లవ్ యూ సో మచ్ సార్ అంటూ అధిక్ రవిచంద్రన్ షేర్ చేసిన వీడియో, ఫొటో నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజిత్ కుమార్ దీంతోపాటు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీలో కూడా త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Thank you #Ajith sir for Giving me this lifetime opportunity , DREAM FULL-FILLED . Love you so much sir ❤️🙏🏻 Last day shoot for sir💥🔥💥🔥 whata beautiful journey #GoodBadUgly ❤️😍 pic.twitter.com/kyfI3GUcnM
— Adhik Ravichandran (@Adhikravi) December 14, 2024
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!