2024 Weddings bells | వృత్తిపరమైన కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న తారలు ప్రతీసారిలాగే ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. 2024లో (2024 Weddings) చాలా మంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టికొత్త జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు, హిందీ,తమిళ చలన చిత్ర పరిశ్రమల నుంచి పలువురు సెలబ్రిటీలు ఏడడుగులు వేశారు. కీర్తిసురేశ్, కిరణ్ అబ్బవరం, రహస్యగోరక్, మేఘా ఆకాశ్, రకుల్ ప్రీత్ సింగ్, వరలక్ష్మి శరత్‌కుమార్, నాగచైతన్య-శోభితా ధూళిపాళ, సిద్దార్థ్-అదితీ రావు హైదరీ, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా ఉన్నారు. ఈ సినీ తారల ఇంట వెడ్డింగ్ బెల్స్‌పై ఓ లుక్కేస్తే..
కీర్తిసురేశ్-ఆంథోనీ తటిల్ :
మహానటి సినిమాతో తెలుగుతోపాటు జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది కీర్తిసురేశ్. వృత్తిపరంగా తీరిక లేకుండా ఉన్న ఈ భామ మొత్తానికి ఈ ఏడాదిబ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పింది. కీర్తిసురేశ్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆంథోనీతో ఏడడుగులు వేసింది. డిసెంబర్ 12న గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ :
రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రహస్య గోరక్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూఆగస్టులో కర్ణాటలోకి కూర్గ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
మేఘా ఆకాశ్-సాయి విష్ణు :
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని భామ మేఘా ఆకాశ్. ఆరేండ్లుగా తన ప్రియుడు సాయివిష్ణుతో ప్రేమలో ఉన్న మేఘా ఆకాశ్ పెళ్లిచేసుకున్నారు.సెప్టెంబర్ 15న చెన్నైలో నిర్వహించిన వివాహ వేడుకలో మేఘా ఆకాశ్ మెడలో మూడు ముళ్లు వేశాడు సాయి విష్ణు.
వరలక్ష్మి శరత్‌కుమార్-నికోలై సచ్దేవ్ :
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ముంబైకి చెందిన తన స్నేహితుడు నికోలై సచ్దేవ్తో జులై 3 ఏడడుగులు వేసింది.
తాప్సీ పన్ను-మథియాస్ బో:
తెలుగులో అగ్రహీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ సుందరి తాప్పీ పన్ను. ఈ బ్యూటీ తన చిరకాల స్నేహితుడు, డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్బోను పెళ్లి చేసుకుంది. మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
సోనాక్షి సిన్హా-జహీరో ఇక్బాల్ :
బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా-జహీర్ ఇక్బాల్ ముంబైలో జరిగిన వేడుకలో జూన్ 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఈ కపుల్ ఏడేండ్లకుపైగా సహాజీవనం తర్వాతముంబైలో జరిగిన వేడుకతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
రెండో వివాహం..
నాగచైతన్య-శోభితా ధూళిపాళ:
2022లో తొలిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాల. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకలో అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. నాగచైతన్య గతంలో సమంతతో విడాకులు తీసుకోగా.. ఇది రెండో వివాహం.
సిద్ధార్థ్-అదితీ రావు హైదరీ :
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు సిద్దార్థ్, అదితీ రావు హైదరీ. చాలా కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ సెలబ్రిటీలు తెలంగాణ శ్రీరంగాపూర్‌లోని 400 ఏండ్ల పురాతన శ్రీరంగనాయక స్వామి ఆలయంలో సెప్టెంబర 16న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం.
క్రిష్ జాగర్లమూడి :
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (krish jagarlamudi) హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా (Priti Challa)ను నవంబర్‌లో పెండ్లి చేసుకున్నాడు.మొదటి భార్య కూడా డాక్టర్ కాగా క్రిష్ ఆమెకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. క్రిష్‌కు ఇది రెండో పెండ్లి.