Kajal Aggarwal | టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ఏదో ఒక అప్డేట్తో ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతుంటుంది. తాజాగా నెట్టింట తన గర్ల్గ్యాంగ్తో సందడి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి టీంతో జాయిన్ అయిపోయింది.
కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఈ గ్యాంగ్‌తో కలిసిపోయాడు. వీరంతా ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వీరంతా కలిసి కనిపించడం వెనుక సీక్రెట్ ఏమై ఉంటుందనే కదా మీ డౌటు. ఫ్రెండ్స్ రీయూనియన్‌లో భాగంగా వీరంతా ఒక్క చోట కలిసి సందడి చేశారు. ఈ ఫొటోలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
2024కు గుడ్ బై చెప్పబోతున్న సందర్భంగా.. వీరంతా ఇయర్ ఎండ్ పార్టీని గ్రాండ్‌గా జరుపుకున్నట్టు స్టిల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. ఇక మిగిలి ఉంది తమన్నా-విజయ్ వర్మ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ అంటూ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Their friendship 🫶🏻❤️#KajalAggarwal #Tamannaah pic.twitter.com/hD9V5wTPqZ
— 𝐊α𝗃αᥣ𝗂α𐓣 👻 (@Ayesha_kajalfan) December 29, 2024
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!