Nag Ashwin| మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంపౌండ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
తాజాగా ఓ చిట్ చాట్‌లో ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. సలార్ డైనోసారి అయితే కల్కి 2898 ఏడీ డ్రాగన్ అవుతుందన్నాడు నాగ్ అశ్విన్. బాక్సాఫీస్ వద్ద సెగలు పుట్టించేందుకు సలార్ 2, స్పిరిట్ వేచి ఉన్నాయి. స్పిరిట్, సలార్ 2 రూ.1500 కోట్లు హ్యాట్రిక్ వసూళ్లు రాబట్టడం చూడొచ్చని చెప్పాడు. బడ్జెట్‌ను రికవరీ చేసుకునేందుకు మాత్రమే పాన్ ఇండియా సీక్వెల్స్ వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ పార్ట్ 2 త్వరలోనే ఉండబోతుందన్నాడు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ టైంలో ఒక పార్ట్ తీయాలా, రెండు భాగాలు తీయాలా అనే అయోమయంలో ఉన్నప్పుడు చీటీలు వేసి 2 అని ఫిక్స్ అయినట్టు చెప్పాడు.
ఒకవేళ కల్కి 2898 ఏడీలో మహేశ్ బాబు లార్డ్ కృష్ణగా పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తే సినిమా రూ.2 వేల కోట్లు రాబట్టేదని, ఇదివరకెన్నడూ విధంగా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేదన్నాడు. ఒకవేళ ఫుల్ లెంగ్త్ గాడ్ రోల్ ఊహించుకుంటే.. పక్కా మహేశ్ బాబును పెట్టేస్తా. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!