Vincy Aloshious | ఓ సినిమా సెట్లో హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేసింది. ‘సూత్రవాక్యం’ (Suthravakyam) సినిమా సెట్లో నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( Kerala Film Chamber of Commerce), మలయాళ చిత్ర పరిశ్రమకు (Malayalam film industry) ఫిర్యాదు చేసింది.
Kochi, Kerala: Malayalam film actress Vincy Aloysius has filed a complaint with Film Chamber, against actor Shine Tom Chacko after he allegedly misbehaved on the set while under the influence of alcohol. Vincy filed the complaint with the Film Chamber and the film industry’s…
— ANI (@ANI) April 17, 2025
కాగా, 2019 లో విన్సీ సోనీ మళయాల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘రేఖ’ అనే మూవీతో కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘జనగణన’ చిత్రం అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. అయితే ఓ సినిమా సెట్లో హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె బుధవారం సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకొని వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను ఎన్నో ఇబ్బందులు అనుభవించినట్టు తెలిపింది. ఓ సారి అయితే తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని కూడా తెలియజేసింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులు వేధింపులకు గురౌతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికి కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుని మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది. తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికి తెలిసిన కూడా దీనిపై ఎవరూ మాట్లాడలేదని విన్సీ సోనీ అలోషియస్ ఎమోషనల్ అయ్యింది. ఆ ఘటన తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. నేను తీసుకున్న నిర్ణయం వలన భవిష్యత్‌లో సినిమా అవకాశాలు రాకపోవచ్చని.. అయిన ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పదలచుకున్నాను అని పేర్కొంది విన్సీ. అయితే తనను వేధించిన ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆమె నిన్న రివీల్ చేయలేదు. తాజాగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో మాత్రం నటుడి పేరును షైన్ టామ్ చాకోగా పేర్కొంది.
షైన్ టామ్ చాకో.. నాని నటించిన ‘దసరా’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టాడు. ఈ మూవీలో విలన్‌పాత్ర పోషించాడు. ఆ తర్వాత నాగశౌర్య ‘రంగబలి’, ‘దేవర’, ‘డాకు మహారాజ్’, ‘రాబిన్ హుడ్’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో నటి ఆరోపణలతో అతడు చిక్కుల్లో పడ్డాడు.
Also Read..
N Shankar Son | మెగాస్టార్ చిరంజీవిని కలిసిన దర్శకుడు ఎన్ శంకర్ కొడుకు
Abhinaya | వివాహబంధంలోకి అడుగుపెట్టిన నటి అభినయ
Thalapathy Vijay | ఇఫ్తార్ వివాదం.. నటుడు దళపతి విజయ్‌పై ఫత్వా జారీచేసిన ముస్లిం బోర్డు