Jai Bolo Telangana Director | విప్లవ చిత్రాల దర్శకుడు ఎన్ శంకర్ (N Shankar) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీరాములయ్య (Sriramulayya), ఎన్కౌంటర్(Encounter), భద్రాచలం (Badrachalam), జయం మనదేరా, బై బోలో తెలంగాణ (Jai Bolo Telangana) వంటి సంచలన చిత్రాలు తెరకెక్కించి తెలంగాణ ప్రజలలో చోటు సంపాదించుకున్నాడు. కొన్నిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. ప్రస్తుతం మూడు హిస్టారికల్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే శంకర్ బాటలో అతడి తనయుడు కూడా మెగాఫోన్ పట్టబోతున్నాడు. తన దర్శకత్వ ప్రతిభను నిరుపించేందుకు శంకర్ కుమారుడు దినేష్ మహీంద్ర ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఈ సందర్భంగా చిరంజీవి, దినేష్‌ను అభినందిస్తూ, చిన్న వయసులో అద్భుతమైన కథతో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నందుకు ప్రశంసించారు. అనంతరం సినిమా బడ్జెట్, హీరో-హీరోయిన్ పాత్రల గురించి కూడా చిరంజీవి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఇక తన తొలి సినిమాకు చిరంజీవి ఆశీస్సులు కావాలని కోరగా.. మెగాస్టార్ స్పందిస్తూ.. కచ్చితంగా నీ సినిమా చూస్తాను. నీలాంటి యువ దర్శకులను సినీ రంగంలో ఎంకరేజ్ చేయడం నా బాధ్యత,” అని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సినీ రంగంలో ఎన్. శంకర్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయనను మించి దినేష్ గొప్ప దర్శకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, భుజం తట్టి మెగాస్టార్ అభినందించినట్లు దినేష్ వెల్లడించారు.