Abhinaya | నటి అభినయ (Abhinaya) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రియుడు, హైదరాబాద్‌కు చెందిన వేగేశ్న కార్తీక్ (సన్నీ వర్మ)తో బుధవారం రాత్రి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అభినయ, కార్తీక్ చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్నారు. 2008లో రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు అభినయ. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘ముక్తి అమ్మన్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
గతంలో అభినయ, తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ వదంతులపై అభినయ, విశాల్ స్పందించారు. అప్పుడు అభినయ తన చిరకాల ప్రియుడు కార్తీక్ గురించి మీడియాకు వివరించి, అతని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని పుకార్లకు స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో మార్చి 9న అభినయ, కార్తీక్ నిశ్చితార్థం జరిగింది. నిన్న వివాహంతో వీరిద్దరూ ఒకటయ్యారు. ఈ నెల 20న రిసెప్షన్ నిర్వహించనున్నారు.
A match made in heaven! 🌟💞 Congrats to #Naadodigal fame actress #Abhinaya and #VegesanaKarthik on their wedding day! Here’s to love, laughter, and a happily ever after. #JustMarried #CoupleGoals pic.twitter.com/pL3SGXDaDO
— Chennai Times (@ChennaiTimesTOI) April 17, 2025