Suman | టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Suman) అయోధ్య రామ మందిరాన్ని (Ram Janmabhoomi Temple) సందర్శించాడు. సోమవారం ఉదయం అయోధ్య చేరుకున్న అతడు బాల రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాల రాముడి ప్రతిమను చూసి మంత్రముగ్ధుడిని అయ్యానంటూ తెలిపారు.
”బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తరువాత వచ్చాను. తర్వాత రెండోసారి ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. అయోధ్య రామ మందిరం సంబంధించి ఆలయ నిర్మాణం, డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. మందిరంలో ఎంతో పాజిటివిటీ ఉంది. బాలరాముడి విగ్రహం చూసి మంత్రముగ్ధుడిని అయ్యాను. ఇది చాలా కీలక సమయం అని నేను అనుకుంటున్నాను. మత పరిరక్షణ కోసం బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందంటూ” సుమన్ వెల్లడించాడు.
#WATCH | Ayodhya, UP: On his visit to Shree Ram Temple, Actor Suman says, “…I have come here for the second time… The architecture and design of the temple are amazing. It is very clean. Inside the temple, there is another level of positivity… The statue of Lord Ram is… pic.twitter.com/5FOkyzceUJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 15, 2024
Also read..