Nita Ambani | కొడుకు పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. స్పెషల్ ఘాగ్రాలో మెరిసిన నీతా అంబానీ.. PICS
Nita Ambani | అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీతా అంబానీ తన కోడళ్లు, కూతురుకి ఏమాత్రం తీసిపోకుండా డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.
Nita Ambani | అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా వారు ధరించిన దుస్తులు, నగలు ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఇక వేడుక ఏదైనా తన దుస్తుల ఎంపికలో ప్రత్యేకతను చాటుకుంటారు నీతా అంబానీ (Nita Ambani) . తన స్టేటస్‌కు తగ్గట్టే వ్యవహరిస్తారు.
తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ పెళ్లిలోనూ నీతా అంబానీ తన కోడళ్లు, కూతురుకి ఏమాత్రం తీసిపోకుండా డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అనంత్ వెడ్డింగ్ సందర్భంగా నిర్వహించిన ప్రతి వేడుకల్లో సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ప్రత్యేక ఫ్యాషన్ దుస్తుల్లో అలరించారు. ఇక జులై 13న జరిగిన ‘శుభ్ ఆశీర్వాద్’ (Shubh Aashirwad) వేడుకల్లో నీతా ఓ స్పెషల్ ఘాగ్రాను ధరించారు. అబుజానీ సందీప్ ఖోస్లా (Abu Jani Sandeep Khosla) రూపొందించిన అద్భుతమైన దుస్తుల్లో మెరిసిపోయారు.
నీతా ధరించిన ఈ జర్దోజీ ఘాగ్రా (zardozi ghagra)ను కాశీ ఆలయాల నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబించేలా చాలా చక్కగా రూపొందించారు. ఈ ఘాగ్రా పురాతన భారతీయ వాస్తుశిల్పాన్ని చూపిస్తుంది. ఇక ఈ ఘాగ్రాకు మ్యాచింగ్‌గా నీతా అంబానీ ధరించిన బ్లౌజ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. బ్లౌజ్ వెనుక భాగంలో నెట్ క్లాత్‌పై రెండు ఏనుగు బొమ్మలతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాని చుట్టూ తన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్ల పేర్లను చేత్తో ఎంబ్రాయిడరీ చేయించారు.
కుమార్తె ఇషా, కుమారులు అనంత్, ఆకాశ్‌తోపాటు పృథ్వీ, వేద, కృష్ణ-ఆద్య పేర్లను సాంస్కృతంలో రాయించారు. పృథ్వీ-వేద పెద్ద కుమారుడు ఆకాశ్-శ్లోకా మెహతా పిల్లలు కాగా, కృష్ణ-ఆద్య ఇషా అంబానీ పిల్లలు. వీటితోపాటు డ్రెస్ మొత్తం సంస్కృత శ్లోకాలతోపాటు స్పెషల్ జెరీ వర్క్‌తో అద్భుతంగా రూపొందించారు. ఇక దుస్తులకు తగ్గట్టు వీరేన్ భగత్ రూపొందించిన పచ్చలు, డైమండ్స్ కలిగిన ఆభరణాలను ధరించిన నీతా అంబానీ వేడుకకే ప్రత్యేక కళ తెచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read..
Radhika Merchant | మంగల్ ఉత్సవ్‌లో బంగారు దుస్తుల్లో మెరిసిన రాధికా మర్చెంట్.. ఫొటోలు వైరల్
Nita Ambani | మీడియాకు క్షమాపణలు చెప్పి.. నేటి వేడుకలకు అతిథులుగా ఆహ్వానించిన నీతా అంబానీ
Imran Khan | ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన షెహబాజ్ ప్రభుత్వం.. పీటీఐపై నిషేధం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

