Thomas Muller : జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం థామస్ ముల్లెర్ (Thomas Muller ) సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) విజేత అయిన థామస్ 34 ఏండ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంత గడ్డపై జరిగిన యూరో చాంపియన్‌షిప్ 2024లో క్వార్టర్ ఫైనల్లోనే జర్మనీ ఓడిపోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దాంతో, ఇక జట్టులో కొనసాగొద్దని ఈ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ ఆటకు అల్విదా చెప్పాడు.
‘దేశం తరఫున ఆడడం నాకు ఎల్లప్పుడూ గర్వfకారణమే. జట్టు సభ్యులుగా మేమంతా కలిసి సంబురాలు చేసుకున్నాం. అప్పుడప్పుడు బాధతో కన్నీళ్లకు కూడా కార్చాం. 14 ఏండ్ల క్రితం తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నేను ఇన్ని రోజులు ఆడుతానని కలలో కూడా అనుకోలేదు. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన జర్మనీ జట్టు సభ్యులకు, అభిమానలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని థామస్ యూట్యూబ్ వీడియోలో వివరించాడు.
Time to say goodbye.
Servus 🖤❤️💛
➡️https://t.co/bBHJLd5U9f#ServusDFBteam #esmuellert #dfbteam #Euro2024 #Nationalmannschaft🇩🇪 pic.twitter.com/xGda1CF4ZN— Thomas Müller (@esmuellert_) July 15, 2024
ముల్లెర్ 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 131 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో ఫిఫా వరల్డ్ కప్ గెలుపొందిన జర్మనీ జట్టుకు ముల్లెరె కెప్టెన్ కావడం గమనార్హం. ఈ స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ 45 గోల్స్ కొట్టాడు. అయితే.. యూరో చాంపియన్‌షిప్‌లో మాత్రం థామస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో, యువతరానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో అతడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.