ఈ ఏడాది హీరో నాని లైనప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రస్తుతం ఆయన పీరియాడిక్ డ్రామా ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా అనంతరం ఆయన సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా నాని మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీనికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తారని తెలిసింది.
ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. పౌరాణిక అంశాలు కలబోసిన ఫాంటసీ చిత్రమిదని, భారతీయ పురాణాల్లో గాడ్ ఆఫ్ వార్‌గా అభివర్ణించే కార్తికేయుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కార్తికేయుడి పౌరాణికగాథకు, సమకాలీన అంశాలు మేళవించి ఓ విభిన్నమైన కథను దర్శకుడు కిషోర్ తిరుమల తయారు చేశాడని చెబుతున్నారు. ఈ సినిమా కథ నానికి బాగా నచ్చిందని, ఆయన తుది నిర్ణయం తెలపాల్సి ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి ‘గౌరీ తనయ’ అనే టైటిల్‌ను నిర్ణయించారని వార్తలొస్తున్నాయి.