బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 12:05:04

28వ రోజు: షారూఖ్ ఖాన్ పాట విన్న అభిషేక్

28వ రోజు: షారూఖ్ ఖాన్ పాట విన్న అభిషేక్

కొన్ని వారాల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్, కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌‌ల‌కి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్, ఐష్‌, ఆరాధ్య‌లు ఇప్ప‌టికే డిశ్చార్జ్ కాగా, అభిషేక్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ద్వారా టైంపాస్ చేస్తున్న అభిషేక్ తాజాగా నీలి రంగు ఆకాశం, 28వ రోజు అని రాసి ఉన్న క్లిప్ బోర్డ్‌ల‌ని క్లిక్‌మ‌నిపించి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. 

షారూఖ్ ఖాన్ న‌టించిన స్వ‌దేశ్ చిత్రంలోని యుహి చాలా చ‌ల్ ర‌హీ అనే సాంగ్‌ని వింటూ వీటిని షేర్ చేశాన‌ని పేర్కొన్నారు అభిషేక్. అయితే తాను కోవిడ్ 19తో పాటు కొన్ని దీర్ఘ‌కాలిక వ్యాధుల వ‌ల‌న ఇంకా ఆసుప‌త్రిలోనే ఉండాల్సి వ‌చ్చింద‌ని అభిషేక్ అన్నారు. త‌న కుటుంబ స‌భ్యుల మాదిరిగానే అభిషేక్ కూడా త్వ‌ర‌గా కోలుకొని ఇంటికి చేరుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్ధిస్తున్నారు 


తాజావార్తలు


logo