Abhinav Gomatam | తనదైన కామిక్ స్టైల్‌తో వినోదాన్ని అందించే యాక్టర్లలో ఒకడు అభినవ్ గోమఠం. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో సూపర్ కామిక్ టైమింగ్‌తో అదరగొట్టేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా (Masthu Shades Unnai Ra). తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా తెరకెక్కించారు.
మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మార్చి 29న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో 100 మిలియన్ ప్లస్కుపైగా రియల్ టైం మినిట్స్‌తో స్ట్రీమింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో వైశాలీ రాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. తరుణ్ భాస్కర్, అలీ రెజా, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, ఫణి చంద్రశేఖర్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
Prabhas | హను రాఘవపూడి-ప్రభాస్ ఫౌజీ పూజా సెర్మనీ ముహూర్తం ఫైనల్..!
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?