Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాను తాజాగా తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
తన దురుసు ప్రవర్తనతో సస్పెండ్ అయిన ఒక బాస్కెట్‌బాల్ కోచ్(ఆమిర్‌ఖాన్) మళ్లీ తన విధుల్లో చేరాలంటే మనసిక వికలాంగులకి బాస్కెట్‌బాల్ ఆట నేర్పి ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాలని కోర్టు షరతు పెడుతుంది. ఈ క్రమంలోనే ఆ కోచ్‌కి ఎదురైన సవాళ్లేంటి అనేది ఈ సినిమా.
Read More