Naveen Chandra | టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన హీరోగా, విలన్‌గా తెలుగు సినిమాలలో నటించి మెప్పించాడు. అరవింద సమేత చిత్రంలో ఆయన ఆవేశం, కత్తులతో హత్య చేయడం వంటి పాత్రల్లో జీవించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో నవీన్ చంద్ర క్రేజ్ మరింత పెరిగింది. అనంతరం కూడా నవీన్ చంద్ర దాదాపు అలాంటి పాత్రలు పోషించాడు. ఇక అమ్ము అనే చిత్రంలో అయితే ప్రతి క్షణం భార్యని అనుమానిస్తూ సైకోలా ఉండే పాత్ర పోషించాడు. ఓటీటీలో ఆయన పాత్రకి బాగా కనెక్ట్ అయిన జనాలు అతడు బయట ఎక్కడ కనిపించిన కూడా మాట్లాడడానికి కాస్త జంకేవారట.
మంత్ ఆఫ్ మధు సినిమాలో నవీన్ చంద్ర భార్య వుండగా మరో అమ్మాయితో ఎపైర్ పెట్టుకుని భార్యకి నరకం చూపిస్తాడు. ఆ తర్వాత వచ్చిన జిగర్ తాండా లోకూ భిన్నమైన పాత్రే చేశాడు. ఇలా ఒక్కోరకంగా విలనిజం ఉన్న పాత్రల్లో జీవించేశాడు. ఈ సినిమాల ప్రభావం ఆయన చుట్టాలు, ఆయన నివశించే చుట్టుపక్కల మహిళలపై బలంగా పడింది. అందుకే వారు నవీన్ చంద్ర భార్యను ఓ సారి ఆసక్తికర ప్రశ్న వేసారట..నవీన్ చంద్ర భార్య ఓర్మాని చుట్టు పక్కలవారు.. నిన్ను నీ భర్త సరిగ్గా చూసుకుంటాడా, లేదంటే నిత్యం ఏడిపిస్తూ ఉంటాడా? నువ్వేమి భయపడకు. మాకు డీజీపీ స్థాయి వాళ్లు తెలుసు. కంప్లైంట్ చేద్దాం అని అనేవారట. అప్పుడు ఓర్మా మా వారు బంగారం అంటూ కితాబిచ్చిందట.
అంటే నవీన్ చంద్ర తన నటనతో ఆడియన్స్ అంతగా ఇన్వాల్స్ అయ్యేలా చేశారు. ఇక నవీన్ చంద్ర నటించిన సూపర్ హిట్ చిత్రం అందాల రాక్షసి జూన్ 13న రీరిలీజ్ కాబోతుంది. ఇందులో రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో నవీన్ చంద్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో అందాల రాక్షసి సినిమా టెంపుల్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నిజంగా పూనకం వచ్చిందని అన్నారు. ఆకాశం చూస్తున్నప్పుడు నేను అలా ఉండిపోయా. కట్ చెప్పట్లేదు. నిజంగానే ఆ సమయంలో పూనకం వచ్చిందని నవీన్ చంద్ర అన్నారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.