3 Idiots Sequel | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కాంబోలో టాప్‌లో ఉంటుంది రాజ్ కుమార్ హిరానీ-అమీర్ ఖాన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన పీకే, త్రీఇడియట్స్ (3 Idiots) చిత్రాలు బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేశాయో తెలిసిందే. కాలేజీ డ్రామా నేపథ్యంలో అమీర్ ఖాన్, మాధవన్, షర్మన్ జోషి లీడ్ రోల్స్‌లో నటించిన త్రీఇడియట్స్ చిత్రం ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ క్రేజీ సెటైరికల్ కామెడీ డ్రామాకు సీక్వెల్ ఉండబోతుందంటూ వార్తలు వచ్చినా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే త్రీ ఇడియట్స్ సీక్వెల్పైఅదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. స్రిప్ట్ ఫైనల్ అయింది. టీం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని వారంతా భావిస్తున్నారు. ఇందులో ఉన్న ఫన్, ఎమోషనల్, అర్థవంతమైన కథ, కథనం మళ్లీ బిగ్ స్క్రీన్‌పై రానుందని ఆశిస్తున్నారు. కథ కొనసాగనుండగా.. సుమారు 15 ఏండ్ల తర్వాత కథలోని పాత్రలు క్లైమాక్స్ సీన్లో (వారి వారి మార్గాల్లో ఉన్న వాళ్లు) మళ్లీ కలిసి కొత్త అడ్వెంచర్‌ను మొదలుపెడతాయని తాజా కథనం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్‌తో చేయబోయే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ నిలిచిపోవడంతో ఈ డైరెక్టర్ త్రీ ఇడియట్స్ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. రాజ్ కుమార్ హిరానీ త్రీ ఇడియట్స్ సీక్వెల్‌ను పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. హిరానీ ఎప్పుడూ త్రీ ఇడియట్స్ సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆయన ఒరిజినల్ (ఫస్ట్ పార్ట్) లెగసీని ఏ మాత్రం దెబ్బతీయకుండా పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నాడని కథనం సారాంశం. మొత్తానికి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా అనే రూల్‌ను రాజ్ కుమార్ హిరానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టు తాజా కథనం చెప్పకనే చెబుతోంది.
Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Actor Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం
V. Shantaram Biopic | వి. శాంతారామ్ బయోపిక్‌లో హీరోయిన్గా తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్