Aakasam Lo Oka Tara | మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో పవన్ సాదినేని దర్శకత్వంలో నటిస్తోన్న ఆకాశంలో ఒక తార (Aakasam Lo Oka Tara)ఒకటి. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
చాలా రోజుల తర్వాత ఆకాశంలో ఒక తార చిత్రం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. మేకర్స్ ఫైనల్‌గా హీరోయిన్ ఎవరనేది అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హీరోయిన్ను ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్టు ప్రీ లుక్ ఒకటి షేర్ చేశారు. ఈ మూవీతో సాత్విక వీరవల్లి డెబ్యూ ఇస్తోంది. ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ కూడా లాంచ్ చేయనున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో శృతిహాసన్ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.