SHAMBHALA | టాలీవుడ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ శంబాల (SHAMBHALA). ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఆది సాయికుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లాంచ్ చేసిన శంబాల ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మంటల మధ్యలో నుంచి సైకిల్‌పై వస్తున్న ఆది లుక్ సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
ఇక న్యూఇయర్ కానుకగా విడుదల చేసిన మరో పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేస్తున్నారు మేకర్స్.
తాజా పోస్టర్లో పొలంలో వింత ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మ.. మరోవైపు ఆకాశం నుంచి భూమివైపు వస్తున్న నిప్పు కణం చూడొచ్చు. అనుమానాస్పద ప్రపంచం.. అంటూ ఆది సాయికుమార్ సరికొత్త పాయింట్‌తో సినిమా చేస్తున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీలో అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాబోతున్న ఈ మూవీలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీమ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.
ఆది సాయికుమార్ శంబాల లుక్..
#Shambala pic.twitter.com/PKyHkktndX
— Aadi Saikumar (@iamaadisaikumar) December 23, 2024
Team #SHAMBHALA: A Mystical World 🔥 came together to celebrate Promising Star @iamaadisaikumar’s birthday pic.twitter.com/5IIvTJUxus
— Vamsi Kaka (@vamsikaka) December 23, 2024
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!