SHAMBHALA | టాలీవుడ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar)నటించిన మూవీ శంబాల (SHAMBHALA).ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైంది. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ ఇక హిందీ మార్కెట్లో కూడా తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
శంబాల ఇక హిందీలో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని జనవరి 1న హిందీలో కూడా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి మేకర్స్ హిందీ ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు ఎలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకెళ్లారనేది ఆసక్తికరంగా మారింది. ఇక శంబాల చిత్రాన్ని నార్తిండియా ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించాడు. ఈ మూవీకి శ్రీమ్ మద్దూరి సంగీతం అందించారు. ఈ చిత్రంలో లబ్బర్ పండు ఫేం స్వసిక, రవి వర్మ, మధునందన్, శివ కార్తీక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా శంబాల ఓటీటీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా దక్కించుకోగా.. తెలుగు శాటిలైట్ రైట్స్‌ను జీ దక్కించుకుంది.
HINDI From Jan 1 St #Shambhala Need all ur wishes and support 🙏 pic.twitter.com/tT8u80vTmz
— Aadi Saikumar (@iamaadisaikumar) December 28, 2025
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!