Sabdham | తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్లలో ఒకరు ఆది పినిశెట్టి (Aadhi Pinishetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమా శబ్దం (Sabdham). వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచేస్తుంది.
చాలా రోజుల తర్వాత విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. భయం శబ్ధం భయపెట్టించేందుకు వస్తోంది.. అంటూ లాంచ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటిస్తుండగా.. సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వైశాలి తర్వాత ఆది పినిశెట్టి, అరివజగన్ వెంకటాచలం కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
రిలీజ్ అప్డేట్ లుక్..
The Sound of Fear is coming! 🔊 #Sabdham is geared up to hit the screens on February 28th, 2025!
Get ready for a #SoundThriller ❤️🔥#SabdhamFromFeb28
Starring @AadhiOfficial
An @dirarivazhagan Film
A @MusicThaman MusicalProduced by @7GFilmsSiva pic.twitter.com/p1BDh86rAe
— Aadhi🎭 (@AadhiOfficial) December 25, 2024
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్