బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali). ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను మహేశ్ బాబు లాంఛ్ చేశాడు.
మంచి డైరెక్టర్‌గా నిలదొక్కుకోవాలనే కసితో ఉంటాడు హీరో సుధీర్‌బాబు. డాక్టర్ అలేఖ్య (కృతిశెట్టి) సుధీర్ బాబు కోసం సినిమా స్టార్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే కథాంశంతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతుంది. లవ్, ఫన్, సీరియస్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండనున్నట్టు తెలుస్తోంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది.
Read Also : Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?