పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా మన సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ని ప్రేరణగా తీసుకొని ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాటను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, రూపొందించారు. ప్రసాద్ రాసిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా, కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు. ఉమాశంకర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ పాటను విడుదల చేసేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జెఏసీ చైర్మన్ అంజిబాబు, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ప్రేక్షకుల మనసుల్లో దేశభక్తిని రగిలించే పాట ఇదని, దేశం కోసం ఏదోఒకటి చేయాలనే స్ఫూర్తిని అందరిలో కలిగించేందుకే ఈ పాట రూపొందించామని, దేశం కోసం కుటుంబాలను సైతం వదులుకొని, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు ఈ పాట అంకితమని లక్ష్మణ్ పూడి తెలిపారు.