A.R.Rahman Live Perfomance | ధనుష్ నటించిన రాయన్ సినిమాలోని ఉసురే నీదానే నీదానే పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనుష్ స్వీయ దర్శకత్వలో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలోని అడంగాత అసురన్ (Adangaatha Asuran) రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే యూట్యూబ్‌లో దూసుకుపోవడంతో పాటు అన్ని మ్యూజిక్ యాప్స్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సాంగ్‌కు ఎఆర్. రెహమాన్ లైవ్ ఫర్ఫార్మన్స్ ఇచ్చాడు.
సింగపూర్ వేదికగా ఎఆర్. రెహమాన్ మ్యూజిక్ ఈవెంట్ జరుగగా.. ఈ ఈవెంట్లో సింగర్ మనోతో కలిసి అడంగాత అసురన్ సాంగ్ పాడి అలరించాడు. మనో పాట పాడుతుండగా.. ఎఆర్. రెహమాన్ మధ్యలో గ్యాప్ తీసుకుని ఉసురే నీదానే నీదానే అని పాడడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఎఆర్. రెహమాన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోను మీరు చూసేయండి.
Dear Singapore,
Thank you and Until then see you next time . pic.twitter.com/EZq0DErUGR
— A.R.Rahman (@arrahman) September 3, 2024
Also Read..