Mana Shankara Varaprasad | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad) సినిమాతో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమాలో వినోదం ఏ రేంజ్లో ఉండబోతుందో ఫస్ట్ గ్లింప్స్‌తోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
సాధారణంగా సీనియర్ హీరోలను సిల్వర్ స్క్రీన్‌పై స్లిమ్‌గా చూపించేందుకు కొన్ని సందర్భాల్లో వీఎఫ్ఎక్స్ వాడుతుంటారని తెలిసిందే. ఈ సినిమాలో మాత్రం అలాంటిదేమి వినియోగించలేదు. మన శంకర ప్రసాద్‌గారు గ్లింప్స్‌లో మీరు చూస్తున్న చిరంజీవి విజువల్స్ 95 శాతం ఒరిజినల్‌వేనని.. చిరంజీవి సార్ ఇలా స్లిమ్, సూపర్ యాక్టివ్‌గా కనిపించేందుకు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. చిరంజీవిని సూట్ లాంటి క్లాసీ దుస్తుల్లో ఉండటమంటే తనకు చాలా ఇష్టమన్నాడు అనిల్ రావిపూడి. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. మీ అందరికీ ఇంకా స్టఫ్ రెడీ అవుతోంది. తాజా లుక్ విషయంలో క్రెడిట్ కేవలం చిరంజీవికే ఇస్తానన్నాడు అనిల్ రావిపూడి.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తోన్న విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో త్రిష ఫీమే లీడ్ రోల్లో నటిస్తోంది.
Chiranjeevi | తమ్ముడు నీ ప్రతీ మాట.. నా హృదయాన్ని తాకింది .. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్