Chiranjeevi | షూటింగ్ నుండి డైరెక్ట్‌గా పెళ్లి మండపానికి.. చిరిగిన చొక్కాతోనే పెళ్లిపీటలపై కూర్చున్న చిరు
Chiranjeevi | టాలీవుడ్ కి చిరునామా, భారతీయ సినిమా గర్వకారణం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Chiranjeevi | టాలీవుడ్ కి చిరునామా, భారతీయ సినిమా గర్వకారణం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన సినీ ప్రయాణంలోని ఓ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అది మెగాస్టార్ పెళ్లి రోజున… చిరిగిపోయిన చొక్కాతో పెళ్లి చేసుకున్న ఘటన! 1980లో కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న చిరంజీవి అప్పటికి నటుడిగా తన కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. తల్లిదండ్రుల అంగీకారంతో, నిర్మాత జయకృష్ణ మధ్యవర్తిత్వంతో ఈ వివాహం జరిగింది.
అయితే పెళ్లికి ముందు, ‘మనవూరి పాండవులు’ షూటింగ్ సమయంలో చిరంజీవి నటన చూసిన అల్లు రామలింగయ్య ఎంతో ఇంప్రెస్ అయి తన కుమార్తెను చిరంజీవికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారట. అయితే పెళ్లికి ముహూర్తం ముందు కూడా చిరంజీవి షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. MS రెడ్డి నిర్మించిన ‘తాతయ్యకు ప్రేమలీలలు’ సినిమాలో ఓ పాట షూటింగ్లో పాల్గొన్నారు చిరు. ఆ సమయంలో తన షర్ట్ చిరిగిపోయిందట. మరొకటి మార్చుకునే సమయం లేకపోవడంతో చిరిగిన షర్ట్‌తోనే పెళ్లి పీటలపై కూర్చున్నారు. అయితే ఎవరో ఒకరు ఆయనకు షర్ట్ చిరిగిపోయిందని గుర్తుచేయడంతో చిరు అసహనంగా స్పందిస్తూ .. “ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని తాళి కట్టనివ్వరా?” అని అనేసారట. ఈ విషయాన్ని చిరునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఈ సంఘటన మెగాస్టార్ నటన పట్ల ఉన్న అంకిత భావాన్ని, టైమ్ మేనేజ్మెంట్ను, జీవితంలో వచ్చిన అవకాశాన్ని ఎలా మిస్ చేసుకోకుండా ప్లాన్ చేసుకున్నారో స్పష్టంగా చూపుతుంది. చిరంజీవి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం రెండింటినీ సమతూకంగా నడిపించారు. ఇక చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు ‘ఖైదీ నెం.150’ తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, తన సత్తాని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ తో 2026 సమ్మర్లో పలకరించనున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

