70MM Entertainments | ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 70MM ఎంటైర్టెన్మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ, ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించింది ఈ సంస్థ. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయనున్నట్లు ఈ నిర్మాణ సంస్థ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వేర్వేరు జానర్స్‌లో ఎప్పటిలాగే క్వాలిటీ స్టోరీ టెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమాలను నిర్మిస్తామని నిర్మాతలు తెలిపారు.
తమ సంస్థ నుంచి గతంలో వచ్చిన భలే మంచిరోజు(2015), ఆనందోబ్రహ్మ(2017), యాత్ర (2019), శ్రీదేవి సోడా సెంటర్(2021) సినిమాలు వాణిజ్య పరంగా విజయాలను అందుకోవడంతోపాటు క్రిటిక్స్ అభినందనలు కూడా అందుకున్నాయి. వాటి లాగే రానున్న ఆరు సినిమాలు కూడా అద్భుతమైన నిర్మాణ విలువలతో నిర్మిస్తాం. అని నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తెలిపారు.