నల్లగొండ, అక్టోబర్ 28: జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో కొంత కాలంగా వీధి కుక్కల స్వైర విహారం పెరిగింది. దీంతో పలుమార్లు గ్రామస్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం గ్రామంలోని ముత్యాలమ్మ గుడి సమీపం నుంచి వెళ్తున్న గ్రామస్తులపై కుక్కలు దాడి చేయడంతో బాధితులు దవాఖాన బాటపట్టారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న బొలికొండ పద్మ, పాయిలి జ్యోతి, గొడ్డేటి జ్ఞానేశ్వరి, కత్తుల శివరామ్‌తో పాటు మొత్తం 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో మంగళవా రం గ్రామంలోని బస్తీ దవాఖాన కుక్క కాటు బాధితులతో కిక్కిరిసిపోయింది.
ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరు..
నాలుగో వార్డులోని కేశరాజుపల్లిలో కొంత కాలంగా వీధికుక్కల స్వైర విహారం బాగా పెరిగింది. ఈ విషయమై ఎన్నో సార్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, వినతి పత్రం కూడా ఇచ్చాం. అయినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. మంగళవారం అటుగా వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి కరవటంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారు.
-బొజ్జ రవికాంత్, కేశరాజుపల్లి