Mass Jathara | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తోన్న మూవీ మాస్ జాతర (Mass Jathara). సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తు్న్నాడు. రవితేజ 75 (RT75)గా వస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ భాను బోగవరపు మాస్ జాతర గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
డైరెక్టర్ భాను బోగవరపు మాట్లాడుతూ.. మాస్ ఎలిమెంట్స్‌తో సాగే పోలీసాఫీసర్ పాత్రలు ఇప్పటికే వచ్చాయి. కానీ ఈ సారి కొత్త యాంగిల్‌ను యాడ్ చేసి చూపించాలనుకున్నా. అందుకే హీరో పాత్రకు రైల్వే కాప్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేశా. ఇప్పటిదాకా ఇలా ఎవరూ చూపించలేదు. మన సినిమాలు విభిన్న కోణాల్లో పోలీసుల విధులను చూపిస్తాయి. నేను కొంతమంది రైల్వే పోలీసాఫీసర్లను కలిసి వారి అనుభవాలను, విధుల్లో వారికుండే హద్దులను గురించి అడిగి తెలుసుకున్నా. కమర్షియల్ టచ్‌తో సాగేలా రైల్వే పోలీసులపై చక్కని మాస్ జాతర స్క్రిప్ట్‌ను రెడీ చేశామన్నాడు డైరెక్టర్.
మాస్ జాతరలో రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ చిరంజీవి గ్యాంగ్ లీడర్ లైన్లో ఉంటుంది. గ్యాంగ్‌లీడర్‌లో చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మాస్ టచ్‌తో ప్రేక్షకులకు డిఫరెంట్ వైబ్ అందిస్తాయి. అదే రూట్లో మాస్ జాతరలో అదనంగా మాస్‌గా రొమాన్స్‌ను డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చాడు భాను బోగవరపు.
Nagadurg Debut | ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!