Shivaraj kumar | సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao). 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు హేమంత్ రావు తన తర్వాతి ప్రాజెక్ట్‌ను కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్‌తో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theater) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ టీజర్‌ను చూస్తుంటే. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్నట్లు అర్థమవుతుంది. పుష్ప చిత్రంలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక గోధి బన్న సాధారణ మైకట్టు (Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju), సప్త సాగరాలు దాటి (Sapta sagaralu Daati) లాంటి డిఫరెంట్ జానర్లు తర్వాత హేమంత్ రావు యాక్షన్ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read more