Maatrubhumi | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘మాతృభూమి’ (Maatrubhumi) . అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారతదేశం-చైనా సరిహద్దులో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా వార్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది. ఈ మూవీకి ముందుగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ పెట్టగా.. ఈ మూవీ టీజర్ విడుదలైన తర్వాత గాల్వన్ యుద్ధానికి సంబంధించి వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ చైనీస్ స్టేట్ రన్ చేస్తున్న మీడియా కొత్త వివాదానికి తెరలేపిందని తెలిసిందే. ఈ క్రమంలో ఒరిజినల్ టైటిల్‌పై వచ్చిన అభ్యంతరాల ఫలితంగా సల్మాన్ ఖాన్ అండ్ టీం తీసుకున్న టైటిల్ మార్పు నిర్ణయం తీసుకుందని కొత్త పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
అయితే ఒరిజినల్ స్టోరీపై ఆందోళనలు వ్యక్తమైన తర్వాత సినిమాలో చాలా మార్పులు చేసినట్టు ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా కథనాల ప్రకారం భారత రక్షణ మంత్రిత్వ శాఖ చైనాకు సంబంధించిన అన్ని ప్రత్యక్ష ప్రస్తావనలను తొలగించమని చిత్ర నిర్మాతలకు సలహా ఇచ్చిందట. ఈ నేపథ్యంలో కథనాన్ని చాలా వరకు మార్పు చేయాల్సి వచ్చిందని టాక్. ఈ ఆర్డర్ ‘స్పష్టమైనది..రాజీపడలేనిది’.. చైనాను ఏ రూపంలోనూ చూపించకూడదని.. లేదా చైనా పేరు ప్రస్తావించకూడదని చ్రితయూనిట్కు చెప్పినట్టు ఓ కథనం సారాంశం.
ఈ కారణంగా వాస్తవ భౌగోళిక రాజకీయ సంఘటనలను తీసేసి.. కొత్త సన్నివేశాలను మాతృభూమి స్టోరీలో యాడ్ చేయాల్సి రావడంతో.. సుమారు 40 శాతం భాగాన్ని రీ షూట్ చేశారట. మరి సల్మాన్ ఖాన్ అండ్ టీం వాస్తవాలను చూపించకుండా సిల్వర్ స్క్రీన్‌పై కథను ఎలా ప్రజెంట్ చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో వస్తోన్న తొలి సినిమా ఇది.