ముంబై : అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్‌లో లైబ్రేరియన్ దూబేగా అలరించిన నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra) గురువారం మరణించారు. మిశ్రా భార్య సుజానె బెర్నెట్ కూడా నటిగా రాణించారు. హైదరాబాద్‌లో షూటింగ్లో ఉండగా మిశ్రా మరణించాడని ఆయన స్నేహితుడు, లైఫ్ కోచ్ కుల్వీందర్ భక్షి నటుడి మరణాన్ని ధ్రువీకరించారు.
మిశ్రా కిచెన్‌లో జారిపడటంతో ప్రమాదం వాటిల్లినట్టు చెబుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెలుగుచూడనున్నాయి. 58 ఏండ్ల అఖిల్ మిశ్రా డాన్, గాంధీ మై ఫాదర్, షికార్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నారు.
ఇక 3 ఇడియట్స్‌లో లైబ్రేరియన్ దూబేగా మిశ్రా తన నటనతో పలువురిని ఆకట్టుకున్నారు. ఇక మిశ్రా ఉత్తరన్, ఉదాన్, సీఐడీ, శ్రీమాన్ శ్రీమతి, హతీం వంటి పలు ప్రముఖ టీవీ షోస్‌లో నటంచాడు. అఖిల్ మిశ్రా జర్మన్ నటి సుజానె బెర్నెట్ను 2009 ఫిబ్రవరి 3న వివాహం చేసుకున్నాడు.
Read More :