Bhootham Praytham | హార్రర్ కామెడీతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయని తెలిసిందే. ఇదే జోనర్లో ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టించేందుకు వచ్చేస్తుంది భూతం ప్రేతం (Bhootham Praytham)టీం జబర్దస్త్ ఫేం యాదమ్మరాజు, గల్లీ బాయ్ భాస్కర్, బల్వీర్ సింగ్, బిగ్ బాస్ ఫేం ఎమ్మాన్యుయేల్, గడ్డం నవీన్, రాధిక అచ్యుత్ రావు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా భూతం ప్రేతం.
తెలుగు న్యూ ఇయర్ పార్టీ ఆంథెమ్ 2026 పేరుతో చికెన్ పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు. ఫన్‌గా, యూత్‌ను ఆకట్టుకునేలా సాగుతున్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం ఖాయమని విజువల్స్ చెబుతున్నాయి.
రాజేశ్ ధృవ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యాదమ్మరాజు, ఎమ్మాన్యుయేల్ టీం ప్రేక్షకులను ఓ వైపు భయపెట్టిస్తూ.. మరోవైపు కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తాజా లుక్ హింట్ ఇచ్చేస్తుంది.సుజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
The #ChickenPartySong from #BhoothamPraytham
is out nowhttps://t.co/b2zcTOcE6h… pic.twitter.com/JB5v29XoFP— Telugu Film Producers Council (@tfpcin) December 31, 2025
Tollywood 2025 | 2025 రౌండప్.. హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలివే..!
Raja Saab | ఏంటీ రాజాసాబ్ క్లైమాక్సే అంతసేపు ఉందా..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్