గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 06, 2020 , 08:43:09

'ప‌ద్మావ‌త్' గెట‌ప్‌లో దీపికా డాల్‌.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

'ప‌ద్మావ‌త్' గెట‌ప్‌లో దీపికా డాల్‌.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

గ్లామర్ బ్యూటీ దీపికా ప‌దుకొణే బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ఛ‌పాక్ అనే సినిమాతో త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. యాసిడ్ బాధితురాలి పాత్ర‌లో ఎంతో అద్భుతంగా న‌టించింది. ఈ సినిమాకి ముందు ప‌ద్మావ‌త్ అనే చిత్రంలో యువ‌రాణి పాత్ర పోషించింది.  ఇందులో దీపికా ఒంటి నిండా న‌గ‌లు ధ‌రించి రాయ‌ల్ లుక్‌లో క‌నిపించి మెప్పించింది. అయితే  ప‌ద్మావ‌త్ చిత్రంలోని దీపికా లుక్‌కి సంబంధించిన డాల్స్ ప్ర‌స్తుతం మార్కెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ట‌. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గ‌తంలో సైఫ్‌, క‌రీనా ముద్దుల త‌న‌యుడు తైమూర్ బొమ్మ‌ల‌ని కూడా ఇలా మార్కెట్లో పెట్టి కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే.  


logo