టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ 18 పేజెస్ (18 Pages). మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ సినిమా నుంచి నన్నయ రాసిన పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. నన్నయ రాసిన కావ్యమాగితె తిక్కన తీర్చెనుగా.. రాధమ్మ ఆపిన పాట మధురిమ.. కృష్ణుడు పాడెనుగా..అంటూ సాగుతున్న ఈ పాటను పృధ్విచంద్ర, సితార కృష్ణకుమార్ పాడారు. గోపీసుందర్ కంపోజ్ చేశాడు. శ్రీమణి రాశారు.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు-సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజెస్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
నన్నయ రాసిన లిరికల్ వీడియో సాంగ్..
Here's the first single ~ #NannayaRaasina from #18Pages is out now! ♥️
A @GopiSundarOffl Musical 🎹@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @lightsmith83 @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/rHvo7SjrlS
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2022
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్