మెగాఫోన్ పట్టిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్..హీరో ఎవరంటే..?
దర్శకులు అవుదామనుకుని హీరోలు అయిన వాళ్లు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రవితేజ, నాని అలాంటి జాబితాలోకే వస్తారు. వీళ్లు హీరోలు కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసారు.

దర్శకులు అవుదామనుకుని హీరోలు అయిన వాళ్లు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రవితేజ, నాని అలాంటి జాబితాలోకే వస్తారు. వీళ్లు హీరోలు కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసారు. అవకాశం వచ్చి.. అదృష్టం బాగుండి స్టార్ హీరోలు అయిపోయారు. ఇప్పుడు మరో హీరో కూడా దర్శకుడిగా మారాడు. కొండంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా ముందు దర్శకుడు అవ్వాలనే అనుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. కానీ అనుకోని రీతిలో ఉప్పెన సినిమాతో హీరోగా మారిపోయాడు.
అయితే ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా తన కలల్లో దర్శకత్వం కూడా ఒకటి ఉందని చెప్పాడు. ముందుగా దర్శకుడిగా మారాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ కాలం ఆయన్ని హీరోగా మార్చేసింది. ఉప్పెన సినిమాతో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్. ఈయన సినిమా సాధించిన సంచలనం గురించి మాటలు చెప్పడం కూడా తక్కువే అవుతుంది.
ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఉప్పెన. అయితే ఈయన ఉప్పెన సినిమా సమయంలోనే దర్శకుడిగానూ మారిపోయాడు. తన తొలి సినిమాను ఈయన కూడా తెరకెక్కించాడు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాను కాస్త తెరకెక్కించాడు. మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ కట్ చెప్పాడు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను దర్శకుడు బుచ్చిబాబు తన యూ ట్యూబ్ ఛానెల్ లో విడుదల చేసాడు.
సినిమాలో విజయ్ సేతుపతి, కృతిశెట్టి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను ఈయన తెరకెక్కించాడు. మెగాఫోన్ పట్టుకుని మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ కట్ చెప్పాడు. ఈ వీడియో బాగానే వైరల్ అవుతుందిప్పుడు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా కచ్చితంగా ఫుల్ సినిమా తెరకెక్కిస్తానంటున్నాడు మెగా వారసుడు. మరి ఈయన కోరిక ఎంతవరకు తీరుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

