Zomato Q1 Results | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నికర లాభాల్లో పలు రెట్లు వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేస్తూ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జొమాటో నికర లాభం రూ.253 కోట్లు నమోదైంది. మార్కెట్ వర్గాలు రూ.235 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి. గతేడాది (2023-24)లో కేవలం రూ.2 కోట్ల నికర లాభం గడించింది జొమాటో.
ఆపరేషన్స్ ద్వారా జొమాటో ఆదాయం 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు పెరిగింది. బిజినెస్ 2సీ బిజినెసెస్ ద్వారా గ్రాస్ ఆర్డర్ వాల్యూ 53 శాతం వృద్ధి చెంది రూ.15,455 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీలో 27 శాతం, క్విక్ కామర్స్ విభాగంలో 130 శాతం ఆర్డర్లు పెరిగాయి. జొమాటో తన నాలుగు వ్యాపార సెగ్మెంట్ల పరిధిలో వ్యాపార విస్తరణతోనే జొమాటో లాభాలు గడించినట్లు తెలుస్తున్నది.
Nothing Phone 2a Plus | నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold Rates | బంగారం ధర మళ్లీ పైపైకి.. అందరి కళ్లూ అటువైపే..!
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!