ముంబై, జనవరి 20: విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను అద్దెకిచ్చే వేదిక జిప్ ఎలక్ట్రిక్.. హైదరాబాద్లో విస్తరణపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది మార్చి ఆఖర్లోగా నగరంలో 10వేల వాహనాలను అందుబాటులోకి తెస్తామని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈవో ఆకాశ్ గుప్తా మంగళవారం తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా 22వేలకుపైగా ఈవీలను నడుపుతున్న ఈ సంస్థ.. 1,500కుపైగా బ్యాటరీ మార్పిడి పాయింట్లనూ ఏర్పాటు చేసింది. అలాగే 900కుపైగా త్రీవీలర్ ఈవీలనూ సంస్థ మార్కెట్లో నడుపుతున్నది.