న్యూఢిల్లీ, జనవరి 31 : స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యమహా మోటర్స్.. వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తన ఫ్లాగ్షిప్ మాడల్స్ ఆర్3, ఎంటీ-03 మాడళ్ల ధరలను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచి అమలులోకిరానున్నాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్3 మాడల్ రూ.3,59,900, ఎంటీ-03 మాడల్ ధర రూ.3,49,900కి తగ్గనున్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ప్రీమియం మోటర్సైకిళ్లకు డిమాండ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ రెండు మాడళ్ల ధరలను తగ్గించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.