Worlds first AI software engineer : జస్ట్ సింగిల్ ప్రాంప్ట్‌తో కోడ్స్ రాయడం, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం, సాఫ్ట్వేర్ రూపొందించడం వంటి నైపుణ్యాలతో కూడిన ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్‌ను టెక్ కంపెనీ కాగ్నిషన్ ప్రవేశపెట్టింది. మీరు ఏం అడిగితే అది చేసేయగల సామర్ధ్యం డెవిన్‌కు సొంతం. అయితే ఈ ఏఐ టూల్ మానవ ఇంజనీర్లను రీప్లేస్ చేసే ఉద్దేశంతో రాలేదని, హ్యమన్ ఇంజనీర్లతో కలిసి పనిచేసే విధంగా డిజైన్ చేయబడిందని కాగ్నిషన్ చెబుతోంది.
ఈరోజు తాము డెవిన్‌ను ప్రవేశపెడుతుండటం పట్ల చాలా ఉత్సుకతతో ఉన్నామని, ఈ టూల్ ప్రముఖ ఏఐ కంపెనీల ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తిచేసిందని కంపెనీ తెలిపింది. ఇది తన కోడ్ ఎడిటర్, వెబ్ బ్రౌజర్, షెల్ ద్వారా ఇంజనీరింగ్ టాస్క్‌లను స్వయంగా చక్కదిద్దుతుందని కాగ్నిషన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముందస్తుగా ఆలోచించడం, సంక్లిష్ట టాస్క్‌లను ప్లాన్ చేయడంలో అద్భుతమైన సామర్ధ్యం డెవిన్ కలిగిఉంది.
ఇది వేలాది నిర్ణయాలు తీసుకోగలగడంతో పాటు అది చేసే తప్పుల నుండి నేర్చుకోగలుగుతుంది. అదేమాదిరిగా కాలక్రమేణా మెరుగుపడుతుందని కాగ్నిషన్ చెప్పుకొచ్చింది. ఆపై హ్యూమన్ ఇంజనీర్‌కు అవసరమైన కోడ్ ఎడిటర్, బ్రౌజర్ వంటి అన్ని టూల్స్‌నూ ఇది కలిగిఉంది. ఎస్‌డబ్ల్యూఈ-బెంచ్ కోడింగ్ బెంచ్‌మార్క్‌పై సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్‌లను చక్కదిద్దేందుకు డెవిన్ అద్భుతమైన, అత్యాధునిక సొల్యూషన్‌గా ముందుకొచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన స్టాండర్డ్ సెట్‌కు ఇతర సొల్యూషన్స్‌తో పోలిస్తే ఈ టూల్ అద్భుతంగా పనిచేసినట్టు వెల్లడైందని కంపెనీ పేర్కొంది.
Read More :