IBM Layoffs : ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం రెండు విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. జాబ్ కట్స్‌పై ఇప్పటికే పలువురు ఉద్యోగులకు కంపెనీ సమాచారం అందించినట్టు సమాచారం. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జొనాథన్ అదషెక్ ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు.
లేటెస్ట్ లేఆఫ్స్‌లో కంపెనీ మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లోని ఉద్యోగులపై పెను ప్రభావం పడనుంది. కంపెనీని వీడి వెళ్లాలని కోరుకోని వారిని తొలగించడం నిలిపివేసేందుకు కంపెనీని వీడాలనే ఆలోచన ఉన్న వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఐబీఎం ఇటీవల కోరిన అనంతరం తాజా లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి.
ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో ఐబీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏఐ టెక్నాలజీస్‌తో దాదాపు 8000 మంది ఉద్యోగులను రీప్లేస్ చేయాలని కంపెనీ గత ఆగస్ట్‌లో కంపెనీ వెల్లడించిన ప్రణాళికలో భాగంగా ఏఐతో నిర్వహణ సామర్ధ్యం పెంపు దిశగా కంపెనీ లేటెస్ట్ లేఆఫ్స్‌కు తెగబడినట్టు భావిస్తున్నారు.
Read More :
Liquor mafia | పంపు కొట్టు మందు పట్టు.. యూపీలో లిక్కర్ మాఫియా గుట్టురట్టు..!