విప్రో లాభం 2,870 కోట్లు
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఆరు శాతం పెరిగి రూ. 22,831 కోట్లకు చేరుకున్నది.
బెంగళూరు, జూలై 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఆరు శాతం పెరిగి రూ. 22,831 కోట్లకు చేరుకున్నది. ఐటీ సేవల నుంచి వచ్చే ఆదాయం అంచనావేసిన స్థాయిలోనే నమోదైందని, 2,722-2,805 మిలియన్ డాలర్ల మధ్యలో నమోదుకానున్నదన్న గత అంచనా నిజమైందని విప్రో సీఈవో, ఎండీ థిర్రీ డెలాపోర్ట్ తెలిపారు.
గత త్రైమాసికంలో సంస్థ 1.2 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద ఒప్పందంతో కలుపుకొని మొత్తం 3.7 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నది.
వలసలు 19.4 శాతం నుంచి 17.3 శాతానికి తగ్గినప్పటికీ సంస్థను వదిలిపోతున్న ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. గత త్రైమాసికంలో 8,812 మంది వీడారు. దీంతో మొత్తం సంఖ్య 2,49,758కి చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

