Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Wipro | వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro).. తన ఉద్యోగులకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సంస్థలోని టాప్ పెర్ఫార్మర్స్కు (top performers in key business line) జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది.
Wipro | వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro).. తన ఉద్యోగులకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సంస్థలోని టాప్ పెర్ఫార్మర్స్కు (top performers in key business line) జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. విప్రో అంతర్గత మెమో ఆధారంగా ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ మేరకు నివేదించింది.
ఏటా డిసెంబర్లో విప్రోలో వేతన సవరణ జరుగుతుంది. ఈ ఏడాది కూడా కొందరికి జీతాలు పెరగనున్నాయి. అయితే టాప్ పెర్ఫార్మర్స్ అందరికీ ఈసారి జీతం పెరగడం అనుమానమే. అధిక వేతనం తీసుకుంటున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని అంతర్గత ఈ-మెయిల్స్ ద్వారా సదరు ఉద్యోగులకు విప్రో సమాచారం అందించినట్లు రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది. విప్రో యాజమాన్యం తక్కువ జీతం పొందే కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు యథావిధిగా డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయని తెలిపింది.
కాగా, విప్రో ఇటీవలే వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు నవంబర్ 6వ తేదీన ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఈ ఆదేశాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారు. అయితే మిగతా ఉద్యోగులు కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ముగించి హైబ్రిడ్ తరహలో ఆఫీసుల నుంచి పనిచేయాలని, దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది.
Also Read..
Jay Kotak | నటి అదితి ఆర్యను పెళ్లాడిన జయ్ కోటక్.. పిక్స్ వైరల్
Heavy Rains | తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు, పలు రైళ్లు రద్దు
Khalistani terrorist | ఖలిస్థాన్ తీవ్రవాది హెచ్చరికలు.. ఢిల్లీ, పంజాబ్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఆంక్షలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

