Jay Kotak | నటి అదితి ఆర్యను పెళ్లాడిన జయ్ కోటక్.. పిక్స్ వైరల్
Jay Kotak | బిలియనీర్ బ్యాంకర్ (billionaire banker) ఉదయ్ కోటక్ (Uday Kotak) కుమారుడు జే కోటక్ (Jay Kotak) వివాహం నవంబర్ 7వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మాజీ మిస్ ఇండియా (former Miss India) అదితి ఆర్య (Aditi Arya)ను జే కోటాక్ వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Jay Kotak | బిలియనీర్ బ్యాంకర్ (billionaire banker) ఉదయ్ కోటక్ (Uday Kotak) కుమారుడు జయ్ కోటక్ (Jay Kotak) వివాహం నవంబర్ 7వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మాజీ మిస్ ఇండియా (former Miss India) అదితి ఆర్య (Aditi Arya)ను జయ్ కోటాక్ వివాహం చేసుకున్నారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన ఇతర సెర్మనీలు ఉదయ్‌పూర్‌లో నిర్వహించారు. కాగా, వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, జయ్ కోటక్, అదితి ఆర్య నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ ఎలాంటి సమాచారాన్ని ఇరువురూ ఎక్కడా బయటపెట్టలేదు. వీరి ఎంగేజ్మెంట్ కూడా 2022 ఆగస్టులో జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతా గోప్యంగా ఉంచారు. ఈఫిల్ టవర్ ముందు ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నట్లు ఓ ఫోటో బైటకు వచ్చింది. ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్ కావడంతో వీరి ప్రేమ, పెళ్లి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో జయ్ కోటక్ స్వయంగా నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టారు.
Also Read..
Aditi Arya: జే కోటక్‌ను పెళ్లాడిన అదితి ఆర్య గురించి మీకు తెలుసా ?
Khalistani terrorist | ఖలిస్థాన్ తీవ్రవాది హెచ్చరికలు.. ఢిల్లీ, పంజాబ్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఆంక్షలు
Gaza: గాజాలో సైనిక చర్యకు 4 గంటల విరామం.. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని లేదన్న నెతాన్యూ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

