న్యూఢిల్లీ: బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యా(Aditi Arya)ను మంగళవారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో ఆ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఇతర సెర్మనీలు ఉదయ్‌పూర్‌లో నిర్వహించారు. జే కోటక్‌ను మ్యారేజ్ చేసుకున్న అదితి గురించి తెలుసుకుందాం.
అదితి ఆర్య 1993, సెప్టెంబర్ 18వ తేదీన జన్మించింది. చండీఘడ్‌లో ఆమె పెరిగింది. సాక్రెడ్ హార్ట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆమె ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరింది. షహీద్ సుఖ్‌దేవ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. స్టడీస్ పూర్తి అయిన తర్వాత ఎర్న్స్ట్ అండ్ యంగ్ కంపెనీలో రీసర్చ్ అనలిస్టుగా చేసింది.
2015లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఆర్య ఇండియా తరపున పోటీపడింది. పూరి జగన్నాథ్ తీసిన ఇజమ్ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రణ్వీర్ నటించిన 83 చిత్రంలో కూడా ఆమె నటించింది. వెబ్ సిరీస్ తంత్రలో కీలక పాత్ర పోషించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు నాలుగు లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
కొన్ని ఫిల్మ్స్‌లో చేసిన తర్వాత ఆమె అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ స్కూల్లో ఆమె ఎంబీఏ పూర్తి చేసింది. జే, ఆర్య మధ్య 2022 ఆగస్టులో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈఫిల్ టవర్ ముందు ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నట్లు ఓ ఫోటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.