న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగింది. జనవరిలో 1.81 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతోపాటు తయారీ వస్తూత్పత్తుల రేట్లు పెరుగడమే ఇందుకు కారణమైనట్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం తమ అధికారిక గణాంకాల్లో తెలిపింది.
కాగా, అంతకుముందు డిసెంబర్ నెలలో 0.83 శాతంగా ఉన్నది. నిరుడు జనవరిలో మాత్రం 2.51 శాతంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.